Home >>> భక్తి > తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటలు
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. గత రెండు రోజులుగా సెలవులు కావడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్లలో భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి వైకుంఠంలోని 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
వీరికి ఉచిత సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని తితిదే వెల్లడించింది.అటు రేపు బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. 10న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కాగా, టీటీడీ వెబ్ సైట్ లో అనుబంధ ఆలయాల సమాచారాన్ని త్వరలోనే అప్లోడ్ చేయాలని జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.